వర్ఫ్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ శుక్రవారం వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో ముస్లింలు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల తహశీల్దారు షేక్ చాంద్ పాషా కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. దేశ ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం వక్స్ చట్టాన్ని కొల్లగొట్టేందుకు పూనుకుంటుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ముస్లిం జేఏసీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.