వనపర్తి: దళితవాడల్లో సమస్యలను పరిష్కరించాలి: సీపీఎం

65చూసినవారు
వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని 4, 5 వ దళిత వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గురువారం సీపీఎం నాయకులు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల నాయకులు అజయ్ మాట్లాడుతూ. దళితవాడలో మరుగుదొడ్లు, రహదారి, విద్యుత్ వైర్లు మార్చాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ రవిబాబుకు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్