వనపర్తి పట్టణంలోని 9వ వార్డులో ఇటీవల వేసిన సీసీ రోడ్లకు పక్కన మట్టి వేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డులు ఎత్తుగా ఉండటంతో పక్కనే ఖాళీగా మిగిలిపోయింది. దీంతో వాహనదారులు, పాదచారులు జారిపడుతున్నారు. వర్షాలు వస్తే నీరు నిలిచి దోమలు పెరగడం, ఇళ్లలోకి నీరు చేరే ప్రమాదం ఉంది. అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.