ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా పెద్దఎత్తున భక్తులతో కిటకిటలాడుతోంది. మహాకుంభమేళాలో సోమవారం ఒక్కరోజే 1.35 కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారు. ఈ విషయాన్ని ఉత్తర ప్రదేశ్ అధికారులు అధికారికంగా వెల్లడించారు. మొత్తంగా ఇప్పటివరకు 54.31 కోట్ల మంది మహాకుంభమేళాకు విచ్చేసినట్లు ఈ ప్రకటనలో పేర్కొన్నారు.