TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి నేడు మహకుంభాభిషేకం జరగనుంది. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. దాదాపు 4 దశాబ్దాల తరువాత ఈ మహాకుంభాభిషేకం జరుగుతున్నట్టు ఆలయ నిర్వహకులు తెలియ జేశారు. ఈ మహోత్సవంలో మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నట్లు సమాచారం.