శ్రీశ్రీ 1933-47 మధ్యకాలంలో రచించిన కవితలను 1950లో 'మహాప్రస్థానం' అనే పేరుతో నళినీకుమార్ అనే సాహితీ అభిమాని తొలిసారి ప్రచురించారు. ఈ పుస్తకం 41 కవితలతో రూపొందించబడి తెలుగు సాహిత్యంలో గొప్ప మలుపు తెచ్చింది. ప్రతి ముద్రణలో 2000 కాపీలతో, ఇప్పటివరకు 34 సార్లు పునఃముద్రణ అయింది. ఈ పుస్తకానికి వచ్చిన వ్యాఖ్యానాలు, విశ్లేషణలు ఏ ఇతర పుస్తకాలకు రాలేదు. ఇది తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప మైలురాయి.