మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతుంది. మొత్తం 288 స్థానాలకు గానూ 200 పైగా స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే సిద్ధమైంది. ఈ క్రమంలో 25న లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తర్వాతి రోజు అంటే 26న నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ శ్రేణులు తెలుపుతున్నాయి.