చాహల్‌తో డేటింగ్ రూమర్స్.. స్పందించిన మహ్‌వశ్

67చూసినవారు
చాహల్‌తో డేటింగ్ రూమర్స్.. స్పందించిన మహ్‌వశ్
టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో చాహల్, మహ్‌వశ్ అనే అమ్మాయితో కనిపించారు. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ రూమర్స్‌పై మహ్‌వశ్ స్పందించారు.'నాకు కావాల్సింది కూడా ఇదే. మనం ఏ తప్పు చేయకుండా, అనవసర విషయాలు పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగాలి'అని ట్విట్టర్‌లో పోస్ట్ రాశారు.

సంబంధిత పోస్ట్