రష్యాలోని కురిల్ దీవుల ప్రాంతంలో భూకంపం సంభవించింది. యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. దీని తీవ్రత 6.5గా నమోదైంది. భూకంప కేంద్రం భూమికి 12 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రకంపనలు భారీగా నమోదవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏదైనా ప్రాణనష్టం జరిగిందా అనే అంశంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.