యూరప్‌లో భారీ భూకంపం

82చూసినవారు
యూరప్‌లో భారీ భూకంపం
గ్రీకు ద్వీపం కాసోస్‌లో బుధవారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. ఈ భూకంపం 14 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం ఇజ్రాయెల్, ఈజిప్టు, లిబియా, టర్కీ, మొత్తం తూర్పు మధ్యధరా ప్రాంతంలో కనిపించింది. దీంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్