TG: హైదరాబాద్‌లోని పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దివాన్‌దేవ్‌డిలోని ఓ కాంప్లెక్స్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో 16 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో పలు బట్టల షాపులకు నిప్పంటుకోవడంతో మంటలు చెలరేగాయి. రంజాన్ నేపథ్యంలో వ్యాపారులు కొత్త స్టాక్ తెచ్చారు. మంటల్లో స్టాక్ కాలిపోతే రూ.కోట్లలో నష్టపోతామని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.