హైదరాబాద్‌‌‌లో భారీ అగ్ని ప్రమాదం (వీడియో)

57చూసినవారు
TG: హైదరాబాద్‌ మదీనాగూడలోని సెంట్రో ఫుట్‌వేర్ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సెంట్రో ఫుట్‌వేర్ భవనంలో మంటలు ఎగసి పడుతున్నాయి. భవనం అంతటా భారీ మంటలు వ్యాపించడంతో చుట్టూ దట్టమైన పొగ వ్యాపించింది. దీని వలన రోడ్డుపై భారీ ట్రాఫిక్ స్తంభించింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. అధికారులు అక్కడికక్కడే ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్