మలయాళ సీనియర్ నటి కవియూర్ పొన్నమ్మ (79) కన్నుమూశారు. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆమె దాదాపు మలయాళంలో 700 సినిమాల్లో పైగా నటించారు. ఆమె ఎక్కువగా నటుడు మోహన్‌లాల్ సినిమాల్లో తల్లి పాత్రలు పోషించారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.