AP: శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దేవాలయ అధికారులు స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ముఖ్యమంత్రికి స్వామివారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేసి ఆశీర్వదించారు.