TG: 'ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఆయన కులం గురించి మాట్లాడే హక్కు ఉంది. కానీ.. ఇతర కులాలను తిట్టే హక్కు మాత్రం లేదు' అని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. 'ఆయనకు ఇష్టం లేకుంటే పార్టీ నుంచి బయటికెళ్లి మాట్లాడుకోవచ్చు. తీన్మార్ మల్లన్న గెలుపు కోసం నేను, నా కుటుంబం పనిచేశాం. ఈ విషయంపై ఆయనే పార్టీకి నివేదిక కూడా ఇచ్చారు. ఆనాడు మేము రెడ్లు అని గుర్తు లేదా?' అని నాయిని ప్రశ్నించారు.