పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. బెంగాల్‌లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడం వెనుక ఆయన హస్తం ఉందని ఆరోపించారు. బెంగాల్‌లోకి బంగ్లాదేశీయులను వదిలి కావాలనే అల్లర్లు సృష్టిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ స్పందించి ఇప్పటికైనా అమిత్ షాను నియంత్రించాలని సూచించారు.