TG: హైదరాబాద్ సనత్‌నగర్‌లోని డీమార్ట్‌లో ఓ వ్యక్తి ఇలాచీలు దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. దీపక్ అనే వ్యక్తి పలుమార్లు ఇలాచీ ప్యాకెట్లను తీసుకుని వాష్‌రూమ్‌లోకి వెళ్లి లో దుస్తుల్లో దాచుకుని వెళ్తున్నట్లు గుర్తించారు. మరో రోజు మళ్లీ ఆ వ్యక్తి షోరూంకు వచ్చి రెండు 100 గ్రాముల ఇలాచీ ప్యాకెట్లను తీసుకుని లో దుస్తుల్లో దాచుకున్నాడు. అతను తిరిగి వెళ్లిపోతుండగా సిబ్బంది పట్టుకుని సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు.