బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని బెదిరించిన ఆగంతకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సల్మాన్‌ను ఇంట్లోనే చంపేస్తానని సోమవారం దుండగుడు ఫోన్ చేసి బెదిరించగా ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు గుజరాత్‌లోని వడోదర జిల్లాకు చెందిన 26 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. అతను ఓ మానసిక రోగి అని విచారణలో తెలిసినట్లు పోలీసులు వెల్లడించారు.