Top 10 viral news 🔥
ఫార్ములా ఈ-కార్ రేస్.. కేటీఆర్‌పై మరో కేసు నమోదు
ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై ఈడీ ECIR నమోదు చేసింది. ఏసీబీ FIR ఆధారంగా.. మనీలాండరింగ్ నిరోధక చట్టం, ఫెమా ఉల్లంఘన కింద మాజీ మంత్రి కేటీఆర్, అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. యూకేకు చెందిన ఏస్ నెక్ట్స్‌పై కూడా కేసు నమోదు చేసింది. రూ.55 కోట్లు ఏస్ నెక్ట్స్‌కు బదిలీ అయినట్లు గుర్తించింది.