కత్తితో పొడిచి వ్యక్తి దారుణ హత్య

61చూసినవారు
కత్తితో పొడిచి వ్యక్తి దారుణ హత్య
TG: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో శనివారం అర్ధరాత్రి బానోతు కొమ్మాలును గుర్తుతెలియని దుండగులు కత్తితో పొడిచి పరారయ్యారని తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్