వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి

65చూసినవారు
వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి
TG: వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. మిర్యాలగూడ మండలం బి.అన్నారాంకు చెందిన కృష్ణయ్య (70).. మోకాళ్ల నొప్పులతో మండల కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరిన అతనికి సెలైన్, ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే మరణించాడు. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్