TG: తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసే గంధమల్ల రవి అనే వ్యక్తి యాదగిరిగుట్ట పట్టణం ఎమ్మెల్యే ఇంట్లోని 3వ అంతస్తులో శుక్రవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఓ విషయమై వారం రోజుల క్రితం రవిని ఎమ్మెల్యే మందలించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.