TG: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం లక్ష్మిపూర్ అటవీ ప్రాంతంలో ఆదివారం ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. ఇంగోలి వందనకు ఆరోగ్యం బాగా లేదని పూజలు చేయిస్తున్న భర్త ఇంగోలి శంకర్ అటవీ ప్రాంతంలో తీసుకువచ్చాడు. అనంతరం ఆ ప్రాంతంలో కొబ్బరి కాయ, పసుపుతో పూజ చేసినట్లు భార్యను నమ్మించి బండరాళ్లతో తలపై కొట్టి హత్య చేశాడు. తన తండ్రిపై అనుమానం ఉందని కూతురు ప్రియాంక టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. అసలు విషయం బయటపడింది.