TGSRTC పై అసత్య ఆరోపణలు.. ఖండించిన యాజమాన్యం

65చూసినవారు
TGSRTC పై అసత్య ఆరోపణలు.. ఖండించిన యాజమాన్యం
TG: యూనియన్ల పేరుతో TGSRTC పై అసత్య ఆరోపణలు చేయడాన్ని ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. కొంతకాలంగా వారి మనుగడ కోసం ఇష్టం వచ్చినట్టు కొంతమంది మాట్లాడుతూ ప్రకటనలు జారీ చేస్తున్నారంది. దీని ద్వారా ఉద్యోగులు గందరగోళానికి గురవుతున్నారని పేర్కొంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఎస్‌ఆర్‌బీఎస్‌ను సంస్థ రద్దు చేస్తోందంటూ ఓ వార్త ప్రచారం చేస్తున్నారని, ఉద్యోగులను తప్పుదారి పట్టించి రెచ్చగొడుతున్నారని మండిపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్