TG: జయశంకర్ భూపాలపల్లిలోని ఓ మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళకు దిగారు. జిల్లాకేంద్రంలోని యోధా ఆసుపత్రిలో ANMగా పనిచేస్తున్న అఫ్సానా అనారోగ్యానికి గురికావడంతో గత రెండు రోజులుగా చికిత్స పొందుతుంది. ఈ క్రమంలో అఫ్సానా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు శనివారం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి రిఫర్ చేశారు. అయితే అఫ్సానా శుక్రవారం రాత్రి మృతి చెందగా.. తమకు సమాచారం ఇవ్వకుండా, ఎందుకు గోప్యంగా ఉంచారని మృతురాలి బంధువులు నిరసన చేపట్టారు.