పుదీనాలో తెగుళ్ల సమస్య తక్కువగానే ఉంటుంది. నేల ద్వారా సంక్రమించే కాండం కుళ్ళును అరికట్టడానికి పంట మార్పిడిని పాంటించాలి. పుదీనాను మొక్కజొన్న, ఆలుగడ్డ, వరి, చిరుధాన్యపు లాంటి పంటలతో పంట మార్పిడి చేయాలి. కాండం కుళ్లు నివారణకు విత్తనశుద్ధి పాటించాలి. ఆకు మాడు తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.