స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ 42 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఏదైనా డిగ్రీతో పాటు పని అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. జీతం నెలకు రూ.64,820- రూ.93,960 ఉంటుంది. పూర్తి వివరాలకు https://sbi.co.in/web/careers/ ను చూడగలరు.