కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి గ్రామంలో సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే విగ్రహాలను శుక్రవారం ఆవిష్కరించారు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి. ముందుగా ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు జజ్జరేల్లి గ్రామ ప్రజలు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పూలే అడుగుజాడల్లో నడవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మాలి జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, మాలి సంఘం నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.