బెల్లంపల్లి పట్టణంలోని 100 పడకల ఆసుపత్రి పశువుల దొడ్డిగా మారిపోయింది. ఆసుపత్రిలోకి పశువులు చొరబడి తిష్ట వేసి ఉండడంతో పశువులు పోసిన మూత్రం, వేసిన పేడతో ఆసుపత్రి దుర్గం దుర్గంధంతో కంపు కొడుతుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రికి వస్తే రోగాలు తగ్గేలా ఉండాలి కానీ దుర్గంధమైన వాతావరణం లో రోగాలు వచ్చే పరిస్థితులు నెలకొన్నాయని ఆగ్రహిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.