బెల్లంపల్లి మండలంలోని రైతులకు రైతు భరోసా నమోదు చేసుకోవాలని ఏఈవో శ్రీనివాస్ తెలిపారు, ఈ నెల 5కు ముందు పట్టాదార్ పాస్ పుస్తకం పొంది నేటివరకు రైతు భరోసా నందు నమోదు చేసుకోనివారు, ఇప్పటివరకు రైతు బంధు పొందని వారు.. ఈ నెల 16న సంబంధిత రైతువేదికలో మీ వ్యవసాయ విస్తరణ అధికారిని కలిసి రైతు భరోసాలో నమోదు చేసికోవాలని ఏఈవో శనివారం తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోని వారు కూడా అదే రోజు చేసుకోవాలన్నారు.