: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు 2148 వచ్చినట్లు మున్సిపల్ కమీషనర్ శ్రీనివాసరావు తెలిపారు. ఎస్సీ 804, ఎస్టీ 39, బీసీ 984, ఈబీసీ 80, మైనార్టీ 234, క్రిస్టియన్ ఏడు దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈనెల 14 వరకు దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు. కార్పోరేషన్ ల ప్రకారం ఎంపిక ప్రక్రియ ఉంటుందని ఆయన వెల్లడించారు.