కేంద్ర బడ్జెట్ లో మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా కేటాయింపులు జరిపించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. పట్టణ అధ్యక్షురాలు ధారా కళ్యాణి, అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానంతరం ప్రధాని మోడీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.