

హిమాచలప్రదేశ్లో రెడ్అలర్ట్.. 75కు చేరిన మృతులు
హిమాచల్ ప్రదేశ్లో వర్ష బీభత్సం ఉధృతంగా కొనసాగుతోంది. మండి జిల్లాలో మృతుల సంఖ్య 75కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 240 రహదారులు మూసివేశారు. ఒక్క రోజులో 115-204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ తెలిపింది. కంగ్రా, మండి, సిర్మూర్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే చేయగా, షిమ్లా, చంబా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.