బెల్లంపల్లి: విద్యార్థులచే రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ

76చూసినవారు
బిజెపి బెల్లంపల్లి పట్టణ అధ్యక్షురాలు
కళ్యాణి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగా మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియా ప్రభుత్వ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో భారత రాజ్యాంగ పీఠికను మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా రాజ్యాంగం కల్పించిన హక్కులను వారికి సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్