బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని రెండు జిన్నింగ్ మిల్లుల్లో ఐదు రోజులు పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు కార్యదర్శి భాస్కర్ శుక్రవారం తెలిపారు. జిన్నింగ్ మిల్లుల్లో పత్తి గింజలు అధికంగా నిలువ ఉండడం, సంక్రాంతి పండుగ సందర్భంగా బుధవారం వరకు కొనుగోలు జరగవని పేర్కొన్నారు. 16వ తేదీన యధావిధిగా ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.