మా బస్తీలో చెత్తవేయవద్దని, డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తరలించాలని బస్తీవాసులు చెత్తవాహనాలను అడ్డుకున్న సంఘటన శనివారం బెల్లంపల్లి పట్టణంలోని గోల బంగ్లాబస్తీలో చోటు చేసుకుంది. గోల్ బంగ్లా బస్తీ శివారులో చెత్తను పడవేడయంతో దుర్వాసన వెదజల్లుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వారం రోజులు గడువు కావాలని మున్సిపల్ కమీషనర్ చెప్పడంతో వారు శాంతించారు.