బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి క్వార్టర్లలో విద్యుత్ అంతరాయం లేకుండా ఎమ్మెల్యే వినోద్ చర్యలు తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాతరి స్వామి అన్నారు. శుక్రవారం బెల్లంపల్లిలో ఆయన మాట్లాడుతూ నాలుగు రోజులుగా పట్టణంలోని సింగరేణి క్వాటర్లలో అధికారులు విద్యుత్ కనెక్షన్లు తొలగించడంతో ఎమ్మెల్యే వినోద్ సింగరేణి అధికారులతో మాట్లాడి విద్యుత్ పునరుద్ధరించాలని కోరినట్లు పేర్కొన్నారు.