బెల్లంపల్లి పట్టణంలో మురళి మెమోరియల్ క్రికెట్ అకాడమీ లో మొదటి బ్యాచ్ శిక్షణను బెల్లంపల్లి ఎసిపి రవికుమార్ ఆదివారం ప్రారంభించారు. ఈ బ్యాచ్ లో 15 మంది శిక్షణ పొందనున్నారు. ఈ సందర్బంగా ఆయన టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామితో కలిసి మాట్లాడారు. క్రికెట్ అకాడమీ వల్ల క్రీడాకారులు మరింత రాణించాడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రాంతంలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు.