బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తికి చెందిన గుంటి మల్లయ్య కుటుంబ సభ్యులను బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరామర్శించారు మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా సోమవారం రాత్రి వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయనతోపాటు మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, బీఆర్ఎస్ బెల్లంపల్లి పట్టణ నాయకులు ఉన్నారు.