బెల్లంపల్లి: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మహోన్నతుడు

77చూసినవారు
బెల్లంపల్లి: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మహోన్నతుడు
దివంగత మన్మోహన్ సింగ్ మహోన్నతుడని దేశాన్ని కష్టకాలంలో గట్టెక్కించిన దూరదృష్టి కలిగిన ఆర్థిక వేత్తని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ కొనియాడారు. గురువారం బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టిన క్రమంలో దేశాన్ని తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. జైపూర్ పవర్ ప్లాంట్ ను మంజూరు చేశారని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you