కార్మిక వర్గానికి ఎలాంటి ఉపయోగం లేని నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు డిమాండ్ చేశారు. శనివారం బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్లో సివిల్ సప్లై హమాలి కార్మికుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ వ్యాపార వర్గాలకు అనుకూలమైన చట్టాలు తెచ్చి కార్మికులకు అన్యాయం చేస్తుందన్నారు.