అజ్ఞాతం వీడి. జనజీవన స్రవంతిలో కలవండని రామగుండం సిపి శ్రీనివాస్ సూచించారు. బుధవారం బెల్లంపల్లి మండలం చంద్రవేళ్లి గ్రామానికి చెందిన జాడి భాగ్య అలియాస్ పుష్ప , జాడి వెంకటి మావోయిస్టు దంపతుల తల్లి మల్లమ్మ ను సీపీ మంచిర్యాల డిసిపి భాస్కర్ తో కలిసి పరామర్శించారు. కుటుంబ సభ్యుల ప్రస్తుత స్థితిగతులతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిపై సీపీ అడిగి తెలుసుకున్నారు. దుప్పట్లు, నిత్యావసర సరకులను అందజేశారు.