హైదరాబాద్ వాతావరణ శాఖ అందించిన సమాచారం మేరకు జూన్ 7 నుంచి 11 వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ శివకృష్ణ తెలిపారు. కనిష్ట ఉష్ణోగ్రత 28 నుంచి 30 డిగ్రీలు, పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 40 డిగ్రీలు నమోదు అవుతాయని పేర్కొన్నారు. ఒకటి , రెండు భారీ వర్షాలు కురిసి భూమిలో తేమ ఉన్నప్పుడే విత్తనాలు వేసుకోవాలని రైతులకు సూచించారు.