బెల్లంపల్లి పట్టణ శివారులోని కన్నాల జాతీయ రహదారి పక్కన నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకు సున్నం వేయించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. ఇప్పటివరకు నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. బెల్లంపల్లిలో 160 నిర్మాణాలను మంజూరు చేయగా నిధుల కొరతతో ముందుకు సాగలేదు. ఇటీవల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సున్నం వేసే ప్రక్రియ చేపట్టారు