బెల్లంపల్లి: అనుమానిత మృతి కేసులో వ్యక్తి అరెస్టు

57చూసినవారు
బెల్లంపల్లి: అనుమానిత మృతి కేసులో వ్యక్తి అరెస్టు
అనుమానిత మృతి కేసులో బెల్లంపల్లి మండలంలోని బూధ కలాన్ గ్రామానికి చెందిన ఊరడి శంకర్ (22) ను శనివారం అరెస్టు చేసినట్టు రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ తెలిపారు. గత కొంతకాలంగా ఉరడి లక్ష్మణ్, ఊరడి లచ్చయ్య అన్నదమ్ములకు ఉన్న భూతగాదాలతో ఈనెల 8న రాత్రి గ్రామంలో ఇరువురికి వాగ్వాదం జరిగింది. ఇంతలో లచ్చయ్య కుమారుడు శంకర్ వచ్చి ఒక్కసారిగా లక్ష్మణ్ కడుపులో గుద్దాడు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్