బెల్లంపల్లి మండల శివారులోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయాన్ని గురువారం రాత్రి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి సందర్శించారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన సాయిబాబాను వేడుకున్నారు.