బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ పై ఎక్కడా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని బీఆర్ఎస్ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు నూలేటి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణి క్వార్టర్లకు విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తున్నారని తెలిసి చిన్నయ్య కార్మిక కాలనీలను సందర్శించారని పేర్కొన్నారు.