బెల్లంపల్లి పట్టణంలోని రాంనగర్ లో ఇరవేణి ప్రసన్న ఇంట్లో జూదగృహం నిర్వహిస్తుందనే సమాచారం మేరకు వన్ టౌన్ సిఐ దేవయ్య, ఎస్ఐ రాకేష్ లు తమ సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో బెల్లంపల్లి కి చెందిన బోట్లకుంట ఆర్జయ్య, బెల్లంపల్లి మహేష్, రాళ్ళబండి శ్రీకాంత్, పూసల శ్రీకాంత్, తోట శంకర్, ఫయాజ్ మహమ్మద్ లను అరెస్టు చేసి ఒక లక్ష 11, 140 రూపాయలు, 5మొబైల్ ఫోన్ లు, స్వాధీన పరుచుకున్నారు చూసి పోలీసులను చూసి భూక్యా సాయి పరారయ్యాడని సిఐ పేర్కొన్నారు.