బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ పరిధి రాళ్లవాగు చెరువు మట్టిని తమ గ్రామ రైతులకే చెందాలని కన్నాల గ్రామ మాజీ సర్పంచ్ మంద అనిత స్పష్టం చేశారు. ఆదివారం ఆమె గ్రామస్తులతో కలిసి మాట్లాడారు. చెరువు మట్టిని పాత బెల్లంపల్లికి తరలిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు రాత్రి మట్టిని తరలిస్తుండగా నూతనంగా వేసిన రోడ్డు చెడిపోతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.