బెల్లంపల్లి వంద పడకల దవాఖాన కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించకుంటే ఈనెల 13 నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అబ్బోజి రమణ తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులు శనివారం దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్లో ఉన్న ఆరు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ పొందినప్పటి నుంచి ఏ నెల కూడా జీతం ఇవ్వలేదని పేర్కొన్నారు.